న్యూఢిల్లీ: ఓ ఐఎఫ్ఎస్ అధికారి శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలో తాను నివసిస్తున్న భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం మృతుడు భారత విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయంలో సంచాలకుడిగా పని చేస్తున్నట్టు తెలిసింది.
ఆయన డిప్రెషన్(కుంగుబాటు)తో బాధ పడుతున్నట్టు, తల్లితో కలిసి జీవిస్తున్నట్టు తెలిసింది. ‘మృతుడిని జితేంద్ర రావత్గా గుర్తించాం. ఆయనకు 35-40 ఏండ్లు ఉండొచ్చని అనుకుంటున్నాం. ఘటనా స్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు’ అని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.