హైదరాబాద్ : ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ (ఎఫ్ఎమ్జీఈ) జూన్ 2021 కోసం దరఖాస్తు ఫారాల స్వీకరణ ఈ రోజు ఏప్రిల్ 16న ప్రారంభమైంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్‌బిఇ) ఈ పరీక్షను నిర్వహిస్తుంది. విదేశాల నుండి మెడికల్ కోర్సు పూర్తి చేసి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ) నుండి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోరుకునేవారికి ఈ పరీక్ష జరుగుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ మే 6. అభ్యర్థులు https://nbe.edu.in/ వెబ్‌సైట్‌కు లాగినై దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 18న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణ.