పాట్నా: వైరల్ రీల్ కోసం ఒక యూట్యూబర్ ప్రయత్నించాడు. కదులుతున్న రైలులోని ప్రయాణికుడి చెంపపై తన ఫ్రెండ్‌తో కొట్టించాడు. (Man Slap Passenger On Moving Train) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన రితేష్ కుమార్ వీడియోలు రికార్డ్ చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తుంటాడు. ఎక్కువ వ్యూస్ వచ్చేందుకు వైరల్ వీడియో కోసం అతడు ప్రయత్నించాడు. అనుగ్రహ నారాయణ్ రోడ్ స్టేషన్లో కదులుతున్న రైలులో విండో వద్ద కూర్చొన్న ప్రయాణికుడి చెంపపై తన ఫ్రెండ్‌తో కొట్టించాడు. ఈ వీడియోను రికార్డ్ చేశాడు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కుంభమేళాకు వెళ్లే రైలు కోచ్ డోర్ తెరువకపోవడంతో ఒక ప్రయాణికుడి చెంపపై యువకుడు కొట్టినట్లుగా ఈ వీడియోపై ప్రచారం జరిగింది. దీంతో రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు. రితేష్ కుమార్, అతడి ఫ్రెండ్‌ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సంచలన రీల్, వ్యూస్ కోసం తాను ఇలా చేశానంటూ రితేష్ కుమార్ క్షమాపణలు చెప్పాడు.
Just to gain attention and gain followers, a YouTuber made reel of slapping passengers on Train.
RPF and Police swungs into action and arrests him, duly serviced!pic.twitter.com/adpeC3yZZV
— Megh Updates 🚨™ (@MeghUpdates) February 28, 2025