Golgappa Sandwich | గోల్గప్పా తెలుసు.. శాండ్విచ్ తెలుసు కానీ.. ఈ రెండింటిని కలిపి ఎప్పుడూ తినలేదే.. ఇదేం వంటకం.. స్పెషల్ వంటకమా.. అని నోరెళ్లబెట్టకండి. స్పెషల్ వంటకమే.. దీన్ని ఓ ఫుడ్ బ్లాగర్ తయారు చేసి.. తనే టేస్ట్ చేసింది. గోల్గప్పా అంటే తెలుసు కదా. మన దగ్గర పానీపూరీ అంటారు. లేదా గప్‌చుప్ అంటారు. నార్త్‌లో వాటినే గోల్గప్పా అంటారు. గోల్గప్పా అంటే ఇష్టం ఉండని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. అందుకే ఓ ఫుడ్ బ్లాగర్ ఏకంగా గోల్గప్పా, శాండివిచ్ను కలిపి సరికొత్త శాండ్విచ్ను తయారు చేసింది.
బెంగళూరుకు చెందిన ఫుడ్ బ్లాగర్ అంజలి ధింగ్రా గురించే మనం మాట్లాడుకునేది. తనే ఈ వంటకాన్ని తయారు చేసి.. టేస్ట్ చేసి అదిరిపోయింది అంటూ ఆ వీడియోను తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే.. ఆ వీడియోపై కొందరు నెటిజన్లు నెగెటివ్‌గా కామెంట్లు చేస్తున్నారు. ఏం పనిలేదా మీకు.. ఇటువంటి పనికిమాలిన వంటకాలను తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఏం సాధిస్తారు. ఫుడ్‌ను ఎప్పుడూ అగౌరవపరచకండి.. అంటూ కామెంట్లు చేయగా.. మరికొందరు నెటిజన్లు మాత్రం నీ ఫుడ్ ఎక్స్పరిమెంట్ బాగుంది. మేము కూడా ట్రై చేస్తామంటూ కామెంట్లు చేశారు.