భోపాల్: ఐదేండ్ల బాలికను దారుణంగా హింసించి, అత్యాచారం చేసి చంపిన 30 ఏండ్ల అతుల్ నిహాలే అనే వ్యక్తికి మూడు మరణ శిక్షలు విధిస్తూ భోపాల్లోని ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. ఈ కేసులో నిందితుడికి సహకరించిన అతడి తల్లి, సోదరికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి కుముదినీ పటేల్ తీర్పు చెప్పారు. రాష్ట్రంలో ఒక నిందితుడికి మూడు మరణ శిక్షలు విధించడం ఇదే తొలిసారి. భోపాల్లో నివసించే బాలిక 2024, సెప్టెంబర్ 24న అదృశ్యమైంది. నిందితుడి ఫ్లాట్లోని డ్రమ్ములో బాలిక మృతదేహం లభ్యమైంది.