Murder : తల్లి కళ్లముందే ఓ ఐదేళ్ల బాలుడు దారుణ హత్య (Murder) కు గురయ్యాడు. బైకుపై వచ్చిన ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి, అక్కడ నేలపై ఉన్న పదునైన కత్తి తీసుకుని బాలుడి తలనరికేశాడు. బాలుడిపై దాడి చేస్తుండగా గట్టిగా కేకలు వేస్తూ అడ్డుకోబోయిన తల్లిపై కూడా నిందితుడు దాడికి పాల్పడ్డాడు. దాంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. ఇంతలో తల్లి కేకలు విన్న ఇరుగుపొరుగు అక్కడికి వచ్చి నిందితుడిని పట్టుకున్నారు. దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.
స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మహేశ్ అనే 25 ఏళ్ల వ్యక్తి బైకుపై వచ్చి కాలూసింగ్ ఇంట్లో చొరబడ్డాడు. ఇంట్లో నేలపై ఉన్న పదునైన కత్తి తీసుకుని బాలుడి తల నరికేశాడు. బాలుడిపై దాడికి పాల్పడుతుండగా చూసి గట్టిగా కేకలు వేస్తూ అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతడి తల్లి.. తన కొడుకు తల తెగిపడటం చూసి షాక్‌కు గురైంది. అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది.
బాలుడి తల్లి కేకలు విని ఇరుగుపొరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. జరగిన దారుణాన్ని చూసి షాకయ్యారు. నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.
నిందితుడు అలీరాజ్‌పూర్ జిల్లా జోబాట్ బాగ్దీ ఏరియాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతడికి మానసిక పరిస్థితి సరిగా లేదని, నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి తప్పిపోయి తిరుగుతున్నాడని అతడి పేరెంట్స్ ద్వారా తెలుసుకున్నారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించామని, పోస్టు మార్టం నివేదికలు వస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పారు.