Atiq Ahmed’s Killing | గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హత్యపై ఐదుగురు పోలీసులు సస్పెండ్
Atiq Ahmed | పోలీస్ కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ (Atiq Ahmed), ఆయన సోదరుడు అష్రఫ్ హత్యపై ఐదుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు. షాగంజ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అశ్వనీ కుమార్ సింగ్‌తోపాటు ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెండయ్యారు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పోలీస్ కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ (Atiq Ahmed), ఆయన సోదరుడు అష్రఫ్ హత్యపై ఐదుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు. షాగంజ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అశ్వనీ కుమార్ సింగ్‌తోపాటు ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెండయ్యారు. అతిక్ అహ్మద్, అతడి సోదరుడి హత్యపై దర్యాప్తు కోసం యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ పోలీస్ అధికారులను ప్రశ్నించనున్నది. క్రైమ్ సీన్‌ను మళ్లీ సృష్టించేందుకు సిట్ మంగళవారం ప్రయత్నించింది. శనివారం అర్ధరాత్రి వేళ అతిత్ అహ్మద్, అతడి సోదరుడ్ని ఆసుపత్రికి తరలించినప్పుడు ఎంత మంది పోలీసులు భద్రతగా ఉన్నారు? వారి హత్య తర్వాత శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి పోలీసులకు ఎంత సమయం పట్టింది అన్నది సిట్ అధికారులు ఆరా తీశారు.
కాగా, ఈ నెల 15న యూపీ మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ , ఆయన సోదరుడిపై ముగ్గురు వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపి హత్య చేశారు. అతిక్ అహ్మద్ ప్రయాగ్‌రాజ్‌లో మీడియాతో మాట్లాడుతున్న సమయంలో జర్నలిస్టులుగా వచ్చిన ఆ ముగ్గురు లైవ్‌లోనే కాల్పులు జరిపి చంపారు. ముగ్గురు నిందితులను లవ్లేష్ తివారీ, సన్నీ సింగ్, అరుణ్ మౌర్యగా గుర్తించారు. హంతకులను నాలుగు రోజుల పోలీసు కస్టడీకి ప్రయాగ్‌రాజ్ కోర్టు అప్పగించింది. ఏప్రిల్ 23న ఆ ముగ్గురిని మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Atiq Ahmed
- Killing
- Probe
- suspended
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

