కాన్పూర్: తప్పు చేస్తే మనుషులకే కాదు.. శునకాలకు కూడా శిక్ష తప్పదంటూ హెచ్చరిస్తున్నారు యూపీలోని కాన్పూర్ మున్సిపల్ అధికారులు. కేవలం హెచ్చరించడమే కాదు.. ఏకంగా ఐదు వీధి శునకాలకు జీవిత ఖైదు విధించారు. ఇంతకీ ఆ కుక్కలు చేసిన తప్పు మనుషులను కరవడమే. అరవడం.. కరవడం మా హక్కు అంటే ఇక కుదరదంటూ వాటికి అధికారులు శిక్ష విధించారు. ఇటీవల వీధికుక్కల కాటుకు పలువురు గురవుతున్న క్రమంలో మున్సిపాల్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఒక వీధి కుక్క ఎవరినైనా కరిస్తే దానిపై 10 రోజులు నిఘా ఉంచుతారు. ఆ కుక్క మరోసారి ఇద్దరు లేదా ఎక్కువ మందిపై దాడి చేస్తే జీవిత ఖైదు విధిస్తారు.