న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మంత్ర విద్యలు ప్రదర్శిసున్నారని, క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఇక్కడి ఓ గ్రామంలో ఐదుగురు వ్యక్తులను తీవ్రంగా కొట్టి చంపేశారు. గిరిజనులు అత్యధికంగా నివసిస్తున్న సుక్మా జిల్లా ఇక్తాల్ గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుందని జిల్లా పోలీసులు తెలిపారు. ఇద్దరు దంపతులను, మరో మహిళను తీసుకొచ్చి దారుణంగా హింసించి, చంపేశారని, ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని జిల్లా పోలీసు అధికారి ఒకరు చెప్పారు. తాజా ఘటన రాష్ట్రంలో పెను సంచలనం రేపింది. మూడు రోజుల క్రితం ఇదే విధమైన ఘటన భాతపరా జిల్లాలో చోటుచేసుకుంది. చేతబడి చేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ కుటుంబానికి చెందిన నలుగురిని కొంతమంది హత్య చేశారు.