బెంగళూరు: బ్యాంకు దొంగతనం కేసును ఐదు నెలల్లో పోలీసులు ఛేదించారు. చొరీ చేసిన రూ.13 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. (Bank theft Recovery) ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 2024 అక్టోబర్ 28న న్యామతి ఎస్బీఐ బ్యాంక్‌లో రాత్రి వేళ భారీ చోరీ జరిగింది. బ్యాంకు లాకర్‌తోపాటు తాకట్టు పెట్టిన మొత్తం బంగారాన్ని దొంగలు దోచుకున్నారు. ఆధారాలు లేకుండా చేసేందుకు సీసీటీవీ ఫుటేజ్‌కు సంబంధించిన డీవీఆర్‌ను ఎత్తుకెళ్లారు. అలాగే బ్యాంకు అంతటా కారం చల్లి పారిపోయారు.
కాగా, బ్యాంకులో దొంగతనం జరిగినట్లు తెలుసుకున్న అధికారులు షాక్ అయ్యారు. రూ.13 కోట్ల విలువైన17.7 కేజీల బంగారు నగలు చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ బ్యాంకు చుట్టూ 50 కిలోమీటర్ల పరిధిలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అంతరాష్ట్ర దొంగల ముఠా పనిగా అనుమానించారు. దక్షిణ రాష్ట్రాల్లో ఇలాంటి నేరాలకు పాల్పడిన ఉత్తరప్రదేశ్‌లోని బడాయున్కు చెందిన కక్రాలా ముఠాపై దృష్టిసారించారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో రైడ్లు నిర్వహించారు. ఆ ముఠాకు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశారు. అయితే ఎస్బీఐ బ్యాంకు చోరీతో వారికి సంబంధం లేదని తెలుసుకున్నారు.
మరోవైపు తమిళనాడు మదురై జిల్లాలోని ఉసలాంపట్టికి పోలీసుల దర్యాప్తు దారి తీసింది. అక్కడున్న 30 అడుగుల లోతున్న బావిలో దాచిన 15 కిలోల బంగారం ఉన్న లాకర్‌ను గజ ఈతగాళ్ల సహాయంలో వెలికితీశారు. అమ్మడంతోపాటు తాకట్టు పెట్టిన మిగతా బంగారాన్ని ఆయా షాపుల నుంచి రికవరీ చేశారు. ఈ చోరీకి ప్రధాన సూత్రదారుడైన విజయ్‌కుమార్‌తోపాటు ఇతర నిందితులైన అజయ్‌కుమార్, అభిషేక్, చంద్రు, మంజునాథ్, పరమానందను అరెస్టు చేశారు.
కాగా, తమిళనాడుకు చెందిన అజయ్ కుమార్ తన బావ పరమానందతో కలిసి కొన్నాళ్లుగా న్యామతిలో స్వీట్ షాప్ వ్యాపారం చేశాడని పోలీస్ అధికారి తెలిపారు. స్థానికుడైన వ్యాపారి విజయ్ కుమార్ ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడినట్లు చెప్పారు. దీంతో రూ.15 లక్షల లోన్ కోసం బ్యాంకుకు దరఖాస్తు చేయగా తిరస్కరణకు గురైందన్నారు.
అయితే తన ఆర్థిక సమస్యలు తీరడం కోసం బ్యాంకు చోరీకి ఆరు నెలల పాటు విజయ్ కుమార్ ప్లాన్ చేశాడని పోలీస్ అధికారి తెలిపారు. రాత్రి వేళ రెక్కీ నిర్వహించి బ్యాంకు సెక్యూరిటీ వ్యవస్థ గురించి తెలుసున్నాడని చెప్పాడు. టీవీలో నేర సీరియర్లు, యూట్యూబ్ ద్వారా చోరీ టెక్నిక్‌లు తెలుసుకున్నాడని విరించారు. సైలెంట్ హైడ్రాలిక్ కట్టర్లు, కట్టింగ్ పరికరాలు సమకూర్చుకుని మిగతా నిందితులతో కలిసి బ్యాంకు చోరీకి పాల్పడినట్లు వెల్లడించారు.
Inspired by ‘Money Heist,’ a businessman, drowning in debt, plotted Karnataka’s one of biggest gold heists—Rs 13 crore in pledged gold from SBI Bank, Nyamati, Davanagere.
What followed was a 5-month chase across India, leading to a dramatic recovery. @XpressBengaluru A 🧵 pic.twitter.com/CPemT2dbJN
— Marx Tejaswi | ಮಾರ್ಕ್ಸ್ ತೇಜಸ್ವಿ (@_marxtejaswi) March 31, 2025