బెగుసరాయి: బీహార్(Bihar)లో గ్యాంగ్ రేప్ ఘటన జరిగింది. బెగుసురాయిలోని ఓ ఇంట్లోకి అయిదుగురు వ్యక్తులు ప్రవేశించి.. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. భర్తను ఓ గదిలో కట్టిపడేసి, మహిళను బయటకు తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స సమయంలో డాక్టర్లు షాక్ అయ్యారు. బాధితురాలి మర్మాంగం నుంచి ఓ బుల్లెట్, రాయి, చెక్క ముక్కను తీశారు. అత్యంత క్రూర రీతిలో దుండగులు రేప్‌కు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు.
చాకియా పోలీసు స్టేషన్ పరిధిలో జూన్ 11వ తేదీన ఈ ఘటన జరిగింది. రాత్రి 11.30 నిమిషాల సమయంలో టాయిలెట్ కోసం వెళ్లినప్పుడు అయిదుగురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడినట్లు బాధితురాలు చెప్పింది. భర్తను ఓ రూమ్‌లో తాళం వేసి, తన నోరు నొక్కి అత్యాచారానికి పాల్పడినట్లు ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొన్నది. చికిత్స కోసం తొలుత బరౌనీ ఆస్పత్రికి, ఆ తర్వాత సదర్ ఆస్పత్రికి వెళ్లినట్లు చెప్పింది.సదర్ ఆస్పత్రిలో చికిత్స సమయంలో తన మర్మాంగం నుంచి బుల్లెట్, రాయి, చెక్క ముక్కను తీసినట్లు ఆమె పేర్కొన్నది.
గ్యాంగ్ రేప్ సమయంలో స్పృహ కోల్పోవడం వల్ల ఎలా తన ప్రైవేట్ భాగాల్లోకి ఆ వస్తువులు వచ్చాయో తెలియలేదన్నది. మూడు నెలల క్రితం కూడా ఓసారి ముగ్గురు వ్యక్తులు తమ ఇంట్లోకి చొరబడి గ్యాంగ్ రేప్‌కు ప్రయత్నించినట్లు ఆమె చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నది. ఈ షాకింగ్ కేసులో దర్యాప్తు చేపడుతున్నామని డీఎస్పీ ఆనంద్ కుమార్ పాండే తెలిపారు. నిందితులను త్వరలో పట్టుకోనున్నట్లు పోలీసులు చెప్పారు.