Five died : ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. బీహార్ (Bihar) రాష్ట్రంలోని పట్నా రెవెన్యూ జిల్లా (Patna revenue district) లో ఈ ఘటన చోటుచేసుకుంది. అకిల్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని మనాస్ గ్రామం (Manas village) లో ఆదివారం రాత్రి 9.45 గంటల సమయంలో ఓ ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది.
ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. అందరూ నిద్రలో ఉండగా ఇంటి పైకప్పు కూలడంతో పడుకున్నవాళ్లు పడుకున్నట్లే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
శిథిలాల నుంచి మృతదేహాలను తొలగించి పోస్టుమార్టానికి పంపించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. పైకప్పు కూలిన ఇళ్లు 30 ఏళ్ల క్రితం నాటిదని, శిథిలావస్థకు చేరుకుని ఉండటంతో అకస్మాత్తుగా కూలిపోయిందని తెలిపారు.