ముంబయి, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో ఐదు అ ధికారిక గ్రూపులున్నాయని మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్ ఆరోపించా రు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఆయనను ఆరేండ్ల పాటు పార్టీ నుంచి స స్పెండ్ చేశారు. అయితే తాను పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తనను తొలగించారని నిరుపమ్ ఆరోపించా రు. ఐదు కేంద్రాల్లో మొదట సోని యా, తర్వాత రాహుల్, ప్రియాంక , నాలుగో స్థానంలో అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, ఐదో స్థానంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉన్నారని వెల్లడించారు.