న్యూఢిల్లీ : మెట్రో రైల్లో డ్యాన్స్ వీడియోలు, ఇన్‌స్టా రీల్స్ రికార్డింగ్‌పై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) నిషేధం విధించినా, మెట్రోలో రికార్డైన అభ్యంతరకర, విచిత్రమైన వీడియోలు (Viral Video) సోషల్ మీడియాలో వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా మెట్రో రైల్లో ఓ మహిళ ఎక్సర్సైజ్లు చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ క్లిప్‌లో ఫిట్నెస్ కోచ్ మెట్రో హ్యాండ్రెయిల్స్ పట్టుకుని విన్యాసాలు చేయడం కనిపిస్తుంది. ఈ వీడియోను జగజోత్ కౌర్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. హ్యాండ్ రెయిల్స్‌ను వాడుతూ ఆమె బ్యాక్ ఫ్లిప్ విన్యాసాలు చేయడం ఈ క్లిప్‌లో చూడొచ్చు.
సహ ప్రయాణీకులు ఆమె ఏం చేస్తోందని ఆసక్తిగా గమనించడం ఈ క్లిప్‌లో కనిపిస్తుంది. మహిళ విన్యాసాలు ప్రశంసనీయమే అయినా బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ ప్రాంగణాల్లో ఇలాంటి స్టంట్స్ చేయడం తగదని ఓ యూజర్ కామెంట్ చేశారు.
Read More :