న్యూఢిల్లీ : యుద్ధ నౌకలో తొలి మహిళా కమాండింగ్ ఆఫీసర్‌ను నియమించినట్లు భారత నావికా దళం చీఫ్ అడ్మిరల్ హరి కుమార్ చెప్పారు. డిసెంబరు 4న నావికా దళ దినోత్సవాల సందర్భంగా ఆయన శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ అన్ని స్థాయిల్లోనూ మహిళలను నియమించాలనేది నావికా దళం ఆశయమని చెప్పారు. గడచిన సంవత్సరంలో వ్యూహాత్మక జలాల్లో నేవీ యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు అత్యున్నత స్థాయి కార్యకలాపాలకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మహిళా అగ్నివీరుల సంఖ్య 1,000 దాటిందన్నారు.