థాణే: నవీ ముంబైలోని ఉల్వేలో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో జే శ్యామల రావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, పారిశ్రామికవేత్త గౌతమ్ సింఘానియా పాల్గొన్నారు. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుని దేవాలయం నమూనాలో ఈ ఆలయాన్ని సైతం నిర్మించనున్నారు. ఆలయ నిర్మాణానికి 2023 జూన్ 7న శంకుస్థాపన జరిగింది. ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల స్థలంలో రేమండ్ గ్రూప్ నిర్మిస్తున్నది.
బెంగళూరు, సెప్టెంబర్ 4: హత్య, కిడ్నాప్ ఆరోపణలతో అరెస్టయిన కన్నడ హీరో, నటుడు దర్శన్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన ప్రియురాలు పవిత్రా గౌడ్‌ను సామాజిక మాధ్యమంలో వేధిస్తున్నాడన్న కోపంతో తన అభిమాని అయిన రేణుకాస్వామిని అనుచరులతో కలిసి హత్య చేసిన కేసులో దర్శన్, పవిత్రాగౌడ్, అనుచరులను పోలీసులు అరెస్ట్ చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారు. కాగా, హతుడు రేణుకాస్వామి మొబైల్ కన్పించకపోవడంతో డూప్లికేట్ సిమ్‌ను తీసుకున్న పోలీసులు అతని చాటింగ్‌ను వెలికి తీశారు. రేణుకాస్వామి పవిత్రను దూషిస్తూ అసభ్యకరమైన మెసేజ్‌లతో వేధించే వాడు. ఒకసారి తన జననాంగాల ఫొటోను ఆమెకు పంపి ‘దర్శన్ కంటే నానే చాలా బెటర్’ అంటూ మెసేజ్ పెట్టాడని పోలీస్ వర్గాలు వెల్లడించాయి.