న్యూఢిల్లీ, డిసెంబర్ 17: తొలి మిస్ ఇండియా, ప్రఖ్యాత ఫ్యాషన్ జర్నలిస్ట్ మెహర్ కాస్టలినో (81) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బధవారం తుదిశ్వాస విడిచారు. ఆమెకు కుమారుడు కార్ల్, కోడలు నిషా, కుమార్తె క్రిస్టినా ఉన్నారు. ముంబైలో జన్మించిన మెహర్, 1964లో ఫెమీనా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకొని చరిత్ర సృష్టించారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె నిలిచారు. అనంతరం మిస్ యూనివర్స్, మిస్ యూనైటెడ్ నేషన్స్ వంటి అంతర్జాతీయ అందాల పోటీల్లో భారతదేశానికి ప్రాతినిథ్యం వహించారు. మోడలింగ్ తర్వాత ఫ్యాషన్ జర్నలిజంలోకి అడుగుపెట్టి తనదైన ముద్రవేశారు.