Pahalgam Terror Attck | ఎంట్రీ, ఎగ్జిట్ రూట్స్‌ను బ్లాక్ చేసి.. ఎన్ఐఏ దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు
Pahalgam Terror Attck | పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. లోకల్ ఫొటోగ్రాఫర్లు, దుకాణదారులు, డ్రైవర్లను ఇలా దాదాపు 45 మంది ప్రత్యక్ష సాక్షులను పిలిచి విచారించింది.
Pahalgam Terror Attck | పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. లోకల్ ఫొటోగ్రాఫర్లు, దుకాణదారులు, డ్రైవర్లను ఇలా దాదాపు 45 మంది ప్రత్యక్ష సాక్షులను పిలిచి విచారించింది. ఈ సందర్భంగా వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. బైసరాన్ లోయలో (Baisaran Valley) సందర్శకులు (tourists) తప్పించుకునేందుకు వీల్లేకుండా ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలను ఉగ్రవాదులు బ్లాక్ చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తమ వాంగ్మూలంలో తెలిపారు.
ఇద్దరు ఉగ్రవాదులు ఎంట్రీ గేటు నుంచి లోపలికి ప్రవేశించినట్లు చెప్పారు. మరో ఉగ్రవాది ఎగ్జిట్ గేటు వద్ద ఎవరినీ బయటకు వెళ్లనీకుండా కాపలా కాసినట్లు తెలిపారు. తొలిసారి కాల్పులు మొదలైంది ఎగ్జిట్ గేటు వద్దే అని వివరించారు. దీంతో సందర్శకులు భయంతో ఎంట్రీ గేటువైపు పరుగులు తీయగా.. అక్కడ ఉన్న ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు.
ముందుగా ప్రవేశ ద్వారం వద్దకు వెళ్లిన టూరిస్ట్‌లను మహిళలు, పురుషులు రెండుగా విడిపోవాలని ఉగ్రవాదులు ఆదేశించారు. అయితే, అందుకు వారు నిరాకరించడంతో.. హిందూ, ముస్లింలు వేరు కావాలని చెప్పారు. అందుకు కూడా సందర్శకులు నిరాకరించారు. దీంతో వారు వరుసగా దాడులకు పాల్పడ్డారు. ఇక కాల్పులు జరిపే ముందు పర్యాటకులను కల్మా పఠించాలని కోరారు. కల్మా పఠించిన వారిని ఉగ్రవాదులు వదిలిపెట్టారు. ఇక ప్రవేశ ద్వారం నుంచి వచ్చిన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్.. ఉగ్రవాదుల కాల్పులకు గురైన మొదటి వ్యక్తి.
టూరిస్ట్ స్పాట్‌లోని టీ స్టాల్, ఫుడ్ స్టాల్ ప్రాంత సమీపంలోనే అత్యధికంగా ప్రాణ నష్టం జరిగింది. దాడి అనంతరం ముగ్గురు ఉగ్రవాదులు సమీపంలోని అడవిలోకి పారిపోయినట్లు ప్రత్యక్షసాక్షులు తమ వాంగ్మూలంలో తెలిపారు. ఇక మరో ఉగ్రవాది దాడిలోపాల్గొన్న వారికి రక్షణ కల్పించేందుకు సమీపంలోని అడవిలో దాక్కొని ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు ముష్కరులు సైనిక దుస్తులు ధరించగా.. ఒకరు సంప్రదాయ కశ్మీరీ డ్రెస్‌లో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తమ వాంగ్మూలంలో వెల్లడించారు.
Also Read..
X account withheld | భారత్‌లో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతా నిలిపివేత
Airspace | పాక్ విమానాలకు భారత గగనతలం మూసివేత దిశగా కేంద్రం అడుగులు..!
Pahalgam Attack | ఉగ్రదాడికి సంబంధించి వెలుగులోకి కొత్త వీడియో.. జిప్‌లైన్ ఆపరేటర్‌పై అనుమానాలు..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

