కర్నాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో మంటలు చెలరేగాయి. 2.5 ఎకరాల్లో అటవీ ప్రాంతం దగ్ధమైంది. అయితే జంతువులకూ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. అగ్ని ప్రమాదం సంభవించిందంటూ పర్యాటకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. వెంటనే స్పందించి, నష్ట నివారణా చర్యలు చేపట్టారు. ఎండాకాలం ప్రారంభమైన కారణంగా మంటలు మరింత వ్యాప్తి చెందాయని అధికారులు పేర్కొంటున్నారు.
ఎండాకాలం కారణంగా అటవీ ప్రాంతంలో జంతువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటవీ శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పటికే 20 వాచ్ టవర్స్‌ను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా అటవీ ప్రాంతంలో నిరంతర నిఘా సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. 20 వాచ్ టవర్స్‌తో పాటు ఫైర్ ఇంజన్లను కూడా అందుబాటులోకి తెచ్చారు.