ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఒక అభ్యర్థి విజయోత్సవంలో అపశృతి జరిగింది. మహిళలు ఇచ్చిన హారతిపై గులామ్ పడటంతో మంటలు చెలరేగాయి. (Fire Erupts During Election Victory) దీంతో ఆ అభ్యర్థితో పాటు పలువురు మహిళలకు కాలిన గాయాలయ్యాయి. చంద్గడ్లో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి శివాజీ పాటిల్ విజయం సాధించారు. దీంతో శనివారం రాత్రి మహ్గావ్లో అభిమానులు ఏర్పాటు చేసిన విజయోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
కాగా, ఈ సందర్బంగా రంగులు చల్లుకున్నారు. కొందరు మహిళలు శివాజీ పాటిల్‌కు హారతులు ఇచ్చారు. అలాగే అక్కడున్న వారిపై క్రేన్ సహాయంతో గులాల్ చల్లారు. అయితే హారతులపై గులాల్ పడటంతో భారీగా మంటలు చెలరేగాయి. భయాందోళన చెందిన అక్కడున్న వారు దూరంగా పరుగెత్తారు. ఎన్నికల్లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి శివాజీ పాటిల్‌తోపాటు మరి కొందరు మహిళలకు కాలిన గాయాలయ్యాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Maharashtra: Fire Breaks Out During Aarti as Gulal Ignites, Injuring Shivaji Patil
Independent candidate Shivaji Patil, who won the Chandgad Assembly seat, was injured in a fire incident on Saturday during his victory celebration. The mishap occurred in Mahagaon when women… pic.twitter.com/CHcSTsRyU6
— Pune Pulse (@pulse_pune) November 24, 2024