ముంబై: ఎత్తైన టవర్లోని 42వ అంతస్తులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. (Fire Breaks Out On 42nd Floor) దీంతో అగ్నిమాపక బృందాలు వెంటనే అక్కడకు చేరుకున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ముందు జాగ్రత్తగా ఆ అంతస్తులోని నివాసితులను ఖాళీ చేయించారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం 10.45 గంటల సమయంలో బైకుల్లా ప్రాంతంలోని 57 అంతస్తుల టవర్ సాల్సెట్ 27లోని 42వ అంతస్తులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ ఫ్లోర్లో చెలరేగిన మంటలు చాలా దూరం వరకు కనిపించాయి.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే ఫైర్ బృందాలు, పోలీసులు, స్థానిక అధికారులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. లెవల్ 1 అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఐదు అగ్నిమాపక యంత్రాలు, మూడు జంబో ట్యాంకర్లు, అధునాతన నీటి టెండర్, హైడ్రాలిక్ ప్లాట్‌ఫామ్, ఎత్తైన అగ్నిమాపక వాహనం వంటి అధునాతన పరికరాలు, సాంకేతికతను వినియోగించారు.
మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా రెండు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. మంటలు వ్యాపించిన 42వ అంతస్తులోని నివాసితులను ఖాళీ చేయించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా, ఎత్తైన టవర్‌లో అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Fire Breaks Out On 42nd Floor Of Salsette 27 Building In Mumbai’s Byculla
📹 Salman Ansari#Fire #Byculla #Mumbai #Mumbainews #FPJ pic.twitter.com/eKDsfcHGDq
— Free Press Journal (@fpjindia) February 28, 2025