న్యూఢిల్లీ : ఢిల్లీలోని షాజహాన్ రోడ్లో ఉన్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం 3:10 గంటల సమయంలో కార్యాలయంలోని నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన యూపీఎస్సీ సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఐదు ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.