Mahakal Temple | ఉజ్జయినీ ఆలయంలో అగ్నిప్రమాదం.. పూజారులు సహా 13 మందికి..
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీ మహాకాళేశ్వరుడి (Ujjain Mahakal Temple) ఆలయంలో అగ్నిప్రమాదం జరిగింది. హోలీ సందర్భంగా మహాకాళేశ్వరుడికి భస్మ హారతి (Bhasma Aarti) ఇస్తుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో ఐదుగురు పూజారులతోపాటు మరో ఎనిమిది మంది భక్కులు తీవ్రంగా గాయపడ్డారు.
భోపాల్: మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీ మహాకాళేశ్వరుడి (Ujjain Mahakal Temple) ఆలయంలో అగ్నిప్రమాదం జరిగింది. హోలీ సందర్భంగా మహాకాళేశ్వరుడికి భస్మ హారతి (Bhasma Aarti) ఇస్తుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో ఐదుగురు పూజారులతోపాటు మరో ఎనిమిది మంది భక్కులు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడున్నవారు వెంటనే వారిని స్థానిక దవాఖానకు తరలించారు. సోమవారం ఉదయం భస్మ హారతి సమయంలో మహాకాల్కి గులాల్ సమర్పిస్తున్నప్పుడు ధూలెండి కారణంగా అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయని ఓ పూజారి చెప్పారు. గాయపడినవారు దవాఖానలో చికిత్స పొందుతున్నారని అధికారులు చెప్పారు.
కాగా, ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పందించారు. భస్మహారతి సమయంలో అనుకోకుండా ప్రమాదం జరిగిందని చెప్పారు. ఎప్పటికప్పుడు తాను అధికారుల నుంచి సమాచారం తెలుసుకుంటున్నాని తెలిపారు. ప్రస్తుతం అంతా అదుపులోనే ఉందని వెల్లడించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాని ట్వీట్ చేశారు.
ఆలయంలో అగ్నిప్రమాద ఘటన విషయమై సీఎం మోహన్ యాదవ్తో మాట్లాడానని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. గాయపడినవారికి చికిత్స అందించడానికి స్థానిక అధికారులు సహాయం చేస్తున్నారని ఎక్స్ వేధికగా వెల్లడించారు.
Madhya Pradesh CM Mohan Yadav tweets, “The incident of fire at the ‘garbhagriha’ of Mahakal Temple during bhasma aarti is unfortunate. I have been in touch with the administration since morning. Everything is under control. I pray to Baba Mahakal for the quick recovery of all… pic.twitter.com/A43Bqm7FxW
— ANI (@ANI) March 25, 2024
Ujjain Mahakal Temple fire | Union Home Minister Amit Shah tweets, “I spoke with CM Mohan Yadav and collected information regarding the incident of fire. The local administration is making all help and treatment available to the injured…” pic.twitter.com/x3M5oSR6Qy
— ANI (@ANI) March 25, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

