Fire accident : బీహార్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బీహార్ రాజధాని పట్నాలోని బోరింగ్ రోడ్ ఏరియాలో గల ఓ అపార్టుమెంట్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళకు గురయ్యారు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. అపార్టుమెంట్ పై ఫ్లోర్లోని మూడు కిటికీల నుంచి అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Bihar: Fire broke out in an apartment in the Boring Road area of Patna. Fire tenders on the spot. Further details awaited. pic.twitter.com/wzcNf4PNE4
— ANI (@ANI) July 13, 2024