గువాహటి: కాంగ్రెస్ పార్టీ నూతన ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అస్సాంలోని గువాహటిలో ఎఫ్ఐఆర్ నమోదైంది. కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్తోపాటు భారత రాజ్యంతో కూడా పోరాడుతోందంటూ ఈనెల 15న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
రాహుల్ గాంధీ ప్రకటన భావ ప్రకటనా స్వేచ్ఛ హద్దులు దాటిందని, దేశంలో అశాంతికి దారితీయగలదని మాంజిత్ చేటియా అనే వ్యక్తి గువాహటి పోలీసులకు ఫిర్యాదు చేశారు.