Mamata Banerjee | మమతా బెనర్జీకి షాక్.. కోర్టు నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎఫ్ఐఆర్ నమోదు
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి షాక్ తగిలింది. కోర్టు నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలివి.
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి షాక్ తగిలింది. కోర్టు నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలివి. ఆగష్టు 28, శుక్రవారం కోల్‌కతాలో తృణమూల్ ఛాత్ర పరిషత్ (టీఎంసీపీ) ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం జరిగింది. టీఎంసీపీ అంటే టీఎంసీకి చెందిన విద్యార్థి విభాగం.
ఈ కార్యక్రమం నిర్వహించుకునేందుకు కోల్‌కతా హైకోర్టు పలు సూచనలు, నిబంధనలతో అనుమతించింది. దీని ప్రకారం కోల్‌కతాలోని క్యాథెడ్రల్ రోడ్డులోని ఒకవైపు మాత్రమే కార్యక్రమం నిర్వహించుకోవాలి. కానీ, రెండోవైపు కూడా నిర్వాహకులు కార్యక్రమం నిర్వహించారు. వాహనాల రాకపోకలకు అడ్డుతగిలారు. ఇదే సమయంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా నేతలు ప్రవర్తించారు. బ్యారికెడ్లు దాటుకుంటూ, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించారు. దీంతో నిర్వాహకులపై హస్టింగ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఇప్పటికే శుక్రవారం టీఎంసీ అగ్రనేత అభిషేక్ బెనర్జీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాజాగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై బీఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎస్ఐ అపు బైద్య ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి మమతా బెనర్జీ హాజరయ్యారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేశారు. కార్యక్రమాన్ని నిర్వహించిన ఇతర నేతలపై కూడా కేసు నమోదైనట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

