Heat of Love | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: బలమైన ప్రేమానుభూతికి గురైనప్పుడు శరీరమంతా ఒకరకమైన పులకరింపునకు లోనవుతుందని ఫిన్లాండ్ పరిశోధకులు చెబుతున్నారు. వివిధ రకాల ప్రేమలు శరీరంలో ఎక్కడ అనుభూతి చెందుతాయి, వాటి తీవ్రతను తెలిపే మ్యాప్‌ను పరిశోధకులు రూపొందించారు.
27 రకాల ప్రేమ భావన(ప్రేమ, శృంగార, లైంగిక, తల్లిదండ్రుల ప్రేమ, స్నేహితుల ప్రేమ..మొదలైనవి)లకు సంబంధించి వందలాది మందిపై సర్వే చేపట్టిన పరిశోధకులు ఈ మ్యాప్‌ను తయారుచేశారు. శరీరంలో ఏ భాగం ప్రేమానుభూతి పొందుతున్నది? ప్రేమ తీవ్రత మానసికంగా, శారీరకంగా ఏమేరకు ఉందన్నది సర్వేలో పాల్గొన్నవారి నుంచి పరిశోధకులు సేకరించారు.