ముంబై, జూలై 2 (నమస్తే తెలంగాణ): దేశంలో అగ్ర స్థానంలోని ఐదు పాఠశాలల్లో ఒకదానిలో పని చేస్తున్న మహిళా టీచర్ అదే పాఠశాలలో హయ్యర్ సెకండరీ చదువుతున్న మైనర్ బాలుడిని ఫైవ్ స్టార్ హోటళ్లకు తీసుకెళ్లి, లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. పరీక్షలు పూర్తయిన తర్వాత బాధితుడు తన ఇంటికి వెళ్లాడు. అతని ఇంటికి నిందితురాలు తన సర్వెంట్‌ను పంపించి, కలుద్దాం రమ్మని పిలిచింది. దీంతో ఆ బాలుడు తన తల్లిదండ్రులకు తాను అనుభవిస్తున్న బాధను తెలిపాడు. ముంబైలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపాడు. అంతేకాకుండా, తనకు యాంటీడిప్రెసెంట్స్ను ఇచ్చిందని చెప్పాడు. టీచర్‌తో లైంగిక సంబంధాలు పెట్టుకునేలా ఆమె ఫ్రెండ్ ప్రోత్సహించినట్లు తెలిపాడు. దీంతో టీచర్‌తోపాటు ఆమె ఫ్రెండ్‌పై కేసును నమోదు చేశారు. టీచర్‌ను అరెస్టు చేసి, ఆమె ఫ్రెండ్ కోసం గాలిస్తున్నారు.