న్యూఢిల్లీ: యూపీలోని బరేలి పోలీస్స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న ఓ హిందూ మహిళ.. కొద్ది రోజులుగా అదృశ్యమైంది. ఆమె హఠాత్తుగా శుక్రవారం బరేలి మేజిస్ట్రేట్ ముందు ప్రత్యక్షమైంది. తాను ఒక ముస్లిం యువకుడిని పెండ్లి చేసుకోబోతున్నానని, తమ వివాహానికి ప్రత్యేక వివాహ చట్టం కింద అనుమతి ఇవ్వాలని కోరింది. దీనిపై బరేలి పోలీసులు మాట్లాడుతూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న 50 ఏండ్ల మహిళ ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధులకు రావడం మానేసిందని తెలిపారు. తన సోదరి అదృశ్యానికి 30 ఏండ్ల ముస్లిం వ్యక్తే కారణమంటూ ఆమె సోదరుడు ఫిర్యాదు చేశాడని పోలీసులు చెప్పారు. తన సోదరిని అతను మోసగించి, బ్లాక్మెయిల్ చేసి వివాహానికి ఒప్పించాడన్నారు.