న్యూఢిల్లీ, ఆగస్టు 8 : అవయవ మార్పిడి వెయిటింగ్ లిస్టులో మృత అవయవ దాతకు సంబంధించిన మహిళా రోగులు, బంధువులకు లబ్ధిదారులుగా ప్రాధాన్యం లభించనున్నది. అవయవ దానాలను ప్రోత్సహించి లబ్ధిదారులలో లింగ అసమానతను సరిదిద్దేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. దేశంలో అవయవ దానాలు, మార్పిడి సమర్థవంతంగా నిర్వహించేందుకు నేషనల్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (ఎన్ఓటీటీఓ) జారీచేసిన 10 అంశాల మార్గదర్శకాలలో ఈ రెండు నిబంధనలు ఉన్నాయి.
అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న వ్యక్తుల జాబితాలో ఆ దాతకు సంబంధించిన మహిళా రోగులకు ప్రాధాన్యం ఇవ్వాలని, దీని వల్ల లింగ అసమానతను నివారించడం జరుగుతుందని ఎన్ఓటీటీఓ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. మృత దాతకు చెందిన సమీప బంధువుకు అవయవ మార్పిడి అవసరమైతే ఆ వ్యక్తికి ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆగస్టు 2న రాసిలో లేఖలో డాక్టర్ అనిత్ కుమార్ తెలిపారు.