CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
CJP | భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) కు వ్యతిరేకంగా తాము చేస్తున్న శాంతియుత నిరసనలకు కేంద్ర ప్రభుత్వం (Union Govt) భయపడుతోందని, అందుకే తమ పోరాటాన్ని ప్రధాని మోదీ (PM Modi), హోంమంత్రి అమిత్ షా (Amit Shah) లకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంగా మల్చుకుందని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆరోపించింది.
CJP : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) కు వ్యతిరేకంగా తాము చేస్తున్న శాంతియుత నిరసనలకు కేంద్ర ప్రభుత్వం (Union Govt) భయపడుతోందని, అందుకే తమ పోరాటాన్ని ప్రధాని మోదీ (PM Modi), హోంమంత్రి అమిత్ షా (Amit Shah) లకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంగా మల్చుకుందని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆరోపించింది. ముందస్తు అరెస్టు కింద అదుపులోకి తీసుకున్న కొన్ని గంటలకే సీజేపీ సహ కన్వీనర్ అశుతోష్ రంకా (Ashutosh Ranka) ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
గడిచిన 72 గంటల్లో దేశం తీవ్రమైన అరాచక పాలనను చూసిందని రంకా అన్నారు. నిర్దేశిత ప్రాంతంలో శాంతియుతంగా నిరసన తెలియజేయాలనుకున్న వేలాది మందిని దేశవ్యాప్తంగా అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. శనివారం తమను విమానం నుంచి కిడ్నాప్ చేసినంత పని చేశారని చెప్పారు. పరిస్థితి దారుణంగా ఉందన్నారు. తాము తమ తల్లిదండ్రుల నుంచి విన్న 1975 ఎమర్జెన్సీ కథలను కూడా ఈ 72 గంటల పరిణామాలు మించిపోయాయని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా వల్లే ఈ దుస్థితి దాపురించిందని రంకా ఆరోపించారు. ఎన్నికల సంఘం, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రారంభమైన ఈ పోరాటాన్ని ప్రధాని మోదీ, అమిత్ షాలు తమకు వ్యతిరేకంగా జరిగే పోరాటంగా మార్చుకున్నారని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ఎన్నికల సంఘం పూర్తిగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల కనుసన్నల్లోనే పనిచేస్తోందని, బీజేపీని ఎన్నికల్లో గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆరోపించారు.
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కుటుంబంలో జరిగిన విషాదం విషయంలో ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై అశుతోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం అభిజీత్ నాయనమ్మ మరణవార్త తెలిసినప్పుడు కూడా ఢిల్లీ పోలీసులు అత్యంత అమానవీయంగా ప్రవర్తించారని, కెమెరాలు, మైక్రోఫోన్లతో వచ్చి ఆ విషాదాన్ని కూడా ఒక ప్రదర్శనగా మార్చడానికి ప్రయత్నించారని ఆరోపించారు. తన తల్లిదండ్రులు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని, వారు ఆందోళన చెందుతారని, తన కజిన్‌తో మాట్లాడించాలని అభిజీత్ వేడుకున్నా పోలీసులు కనికరించలేదని చెప్పారు.
ఈ పోరాటంలో తమకు మద్దతు నిలిచిన ప్రతిపక్ష నేతలకు సీజేపీ కృతజ్ఞతలు తెలిపింది. నలుగురు మాజీ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, మాణిక్ సర్కార్, పినరయి విజయన్ వీధుల్లోకి వచ్చి యువతతో కలిసి నిలబడటం ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వారు చేస్తున్న పోరాటానికి నిదర్శనమని కొనియాడారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పోరాటం ఇప్పుడే మొదలైందని, దీన్ని ఒక యుద్ధంగా మార్చినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలని ఆయన వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

