మదర్ థెరిస్సా ఛారిటీకి విదేశీ నిధుల లైసెన్సు పునరుద్దరణ

న్యూఢిల్లీ: మదర్ థెరిస్సా ఛారిటీకి చెందిన విదేశీ నిధుల లైసెన్సును పునరుద్దరించారు. రెండు వారాల క్రితం మదర్ థెరిస్సా ఛారిటీ సంస్థల ఎఫ్సీఆర్ఏ లైసెన్సును రద్దు చేసిన విషయం తెలిసిందే. కోల్‌కతా కేంద్రం మదర్ థెరిస్సా ఎన్జీవో తన సేవా కార్యక్రమాలు చేపడుతోంది. థెరిస్సా ఛారిటీకి విదేశాల నుంచి వచ్చిన నిధులు 250 అకౌంట్లలో ఉన్నాయి. అయితే ఆ అకౌంట్లను కేంద్రం బ్లాక్ చేసింది. ఎఫ్సీఆర్ఏ లైసెన్సును పునరుద్దరించినట్లు వచ్చిన వార్తలపై ఇప్పటి వరకు కేంద్రం స్పందించలేదు. తృణమూల్ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ ఈ వార్తలపై రియాక్ట్ అయ్యారు. 56 ఇంచుల శక్తి కన్నా.. ప్రేమ శక్తి బలమైందని తన ట్వీట్లో ప్రధానిని టార్గెట్ చేశారు. ఎఫ్సీఆర్ఏ రద్దుతో అనేక మందిని వేధించారని ఆయన అన్నారు. అయితే ఒడిశాలో ఉన్న థెరిస్సా ఛారిటీ సంస్థలకు ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ సుమారు 78 లక్షలు మంజూరీ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

