న్యూఢిల్లీ, జనవరి 24: కూతురు 50 వరకు అంకెలు చెప్పలేకపోవడంపై తండ్రి ఆగ్రహించాడు. చపాతీ కర్రతో కొట్టి చంపాడు. ప్రమాదవశాత్తు మరణించినట్టు నమ్మించేందుకు ప్రయత్నించాడు. అనుమానించిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన కృష్ణ జైస్వాల్ తన కుటుంబంతో కలిసి ఇక్కడి ఝుర్సెంథాలీ గ్రామంలో చాలాకాలంగా నివసిస్తున్నాడు. భార్యభర్తలు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. నాలుగేండ్ల కుమార్తె ఈ నెల 21న స్కూల్‌కు వెళ్లలేదు. ఇంట్లోనే ఉన్న కృష్ణజైస్వాల్ ఆ చిన్నారికి లెక్కలు బోధిస్తూ, కుమార్తెను 50 వరకు అంకెలు చెప్పమన్నాడు. ఆమె చెప్పలేదన్న పిచ్చి కోపంతో వంటింట్లోని చపాతీ కర్రతో ఆ చిన్నారిని దారుణంగా కొట్టాడు. ఈ ఘటనలో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.