Chennai | చెన్నైలోని ఎన్నూర్లో థర్మల్ పవర్ ప్లాంట్ విస్తరణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ పనులు కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వందలాది మంది కార్మికులు ఎన్నూర్లో పనులు చేస్తున్నారు. మంగళవారం చేపట్టిన పనుల్లో ప్రమాదం చోటు చేసుకున్నది. ప్లాంట్ ముఖభాగంపై ఏర్పాటు చేసిన స్కాఫోల్డింగ్ అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో తొమ్మిది మంది కార్మికులు సంఘటనా స్థలంలోనే చనిపోయారు. మృతులంతా ఉత్తరాదికి చెందిన కార్మికులే. భారీ ఆర్చ్ నిర్మాణ పనుల్లో పాల్గొన్న కార్మికులు చనిపోయగా.. స్కాఫోల్డింగ్ పైన పడడంతో మృతదేహాలన్నీ నుజ్జునుజ్జు అయ్యాయి. మరికొందరు కార్మికులు గాయాలతో చెన్నైలోని రాయపురంలోని స్టాన్లీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది.