హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): రాజ్‌మార్గ్ యాత్ర యాప్ ద్వారా ఫాస్టాగ్ వార్షిక పాస్‌ను ఎవరికైనా బహుమతిగా ఇవ్వొచ్చని ఎన్హెచ్ఏఐ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ యాప్‌లో సూచించిన విధంగా వాహన వివరాలు నమోదు చేసి పాస్‌ను పొందవచ్చని పేర్కొన్నది. ఈ వార్షిక పాస్ ద్వారా వినియోగదారులు సజావుగా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు చేయొచ్చని తెలిపింది. ఈ వార్షిక పాస్ దాదాపు 1,150 టోల్ ప్లాజాలకు వర్తిస్తుందని వెల్లడించింది.
వార్షిక పాస్‌కు ఒకేసారి రూ.3000 చెల్లించడం ద్వారా తరచూ రీచార్జ్ చేయాల్సిన పని ఉండదని సూచించింది. వార్షిక పాస్ రీచార్జ్ చేయించిన రెండు గంటల తర్వాత సదరు వాహనానికి ఆ పాస్ ఆప్డేట్ అవుతుందని పేర్కొన్నది. కాగా, ఆగస్టు 15న ప్రారంభించిన ఈ వార్షిక పాస్ ఇప్పటివరకు సుమారు 25 లక్షల వినియోగదారుల మార్క్‌ను దాటగా, రూ. 5.67 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఎన్హెచ్ఏఐ వెల్లడించింది.