న్యూఢిల్లీ, ఆగస్టు 14: ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్ల కోసం ప్రవేశపెడుతున్న రూ. 3,000 వార్షిక హైవే టోల్ పాసు శుక్రవారం నుంచి అమలులోకి రానున్నది. ఏడాదికి ఒకేసారి రూ. 3,000 చెల్లించి 200 ట్రిప్పులు హైవే టోల్ ప్లాజాలను దాటేందుకు ఉద్దేశించిన ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాసుల కోసం ప్రీ-బుకింగ్ విండోను ప్రభుత్వం గురువారం ప్రారంభించింది.
రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌తోపాటు ఎన్హెచ్ఐఏ, కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వశాఖ(ఎంఓఆర్టీహెచ్) అధికారిక వెబ్సైట్లలో కూడా వార్షిక పాసు యాక్టివేషన్ కోసం ప్రత్యేక లింకు అందుబాటులో ఉంది. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాలకు మాత్రమే వార్షిక పాసు వర్తిస్తుంది.