త్రిసూర్(కేరళం), ఆగస్టు 20: నీట్ ప్రశ్నాపత్రం లీక్‌కు వ్యతిరేకంగా యువత చేస్తున్న నిరసనల నేపథ్యంలో దేశంలో ‘ఫాసిస్ట్ పాలన’ ముగింపు దశకు చేరుకుందని నటుడు ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యానించారు. అలాంటి శక్తి మళ్లీ అధికారంలోకి రాకుండా చూడాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డీవైఎఫ్ఐ) రాష్ట్ర సదస్సును గురువారం నాడిక్కడ ప్రారంభించిన అనంతరం ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ యువత ఇప్పుడు ‘వేటగాడిని’ గుర్తించిందని అన్నారు. ఇప్పుడు మీ గురించి, మీ పేపర్ లీకేజ్‌ల గురించి మాకు తెలుసని ఈ దేశ యువత ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పారని, మొదటిసారి మోదీ అహంకారాన్ని వారు దెబ్బతీశారని ఆయన అన్నారు.