రాజ్యసభ సభ్యులుగా రిటైర్డ్ అవుతున్న 72 మంది సభ్యులకు రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురువారం విందు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా వారందరికీ జ్ఞాపికలను బహూకరించనున్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 12 మంది ఎంపీలు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో తన ప్రతిభను చూపించనున్నారు. మొత్తం 72 మంది రాజ్యసభ సభ్యులు రిటైర్డ్ అవబోతున్నారు. అలాగే.. ఇటీవల రిటైర్డ్ అయిన 19 మంది సభ్యులకు కూడా వెంకయ్య నాయుడు జ్ఞాపికలను బహూకరిస్తారు.
తృణమూల్ ఎంపీ సంతాను సేన్ గిటార్ వాయించనున్నారు. తృణమూల్‌కి చెందిన మరో ఎంపీ డోలాసేన్ రవీంద్ర సంగీతాన్ని ఆలాపించనున్నారు. డీఎంకేకి చెందిన తిరుచి శివ అనే ఎంపీ తమిళ పాటలు పాడనున్నారు. బీజేపీకి చెందిన రూపా గంగూలీ హిందీ పాటలు, మరో ఎంపీ రామచంద్ర ఝాంగ్రా దేశభక్తి పాటలు, ఎన్సీపీ ఎంపీ వందన చవాన్ హిందీ పాటలను ఆలాపిస్తారు.