కరోనా నిబంధనలు పాటించని ఢిల్లీ మార్కెట్ల మూసివేత

న్యూఢిల్లీ: కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు దేశ రాజధాని ఢిల్లీలోని పలు మార్కెట్లను అధికారులు, పోలీసులు మూసివేస్తున్నారు. లాజ్‌పత్ నగర్‌లోని ప్రసిద్ధ సెంట్రల్ మార్కెట్‌ను తాజాగా మూసివేశారు. సెంట్రల్ మార్కెట్లో సుమారు రెండు వేలకుపైగా షాపులున్నాయి. ప్రతి రోజు వినియోగదారులు భారీగా వస్తుండటం, కరోనా నిబంధనలు, సామాజిక దూరాన్ని పాటించకపోవడంతో ఈ మార్కెట్‌ను తదుపరి ఆదేశాల వరకు మూసివేస్తున్నట్లు అధికారులు సోమవారం తెలిపారు.
మరోవైపు సదర్ బజార్‌లోని రుయి మండి మార్కెట్, పంజాబీ బస్తీ, నాంగ్లోయిలోని జనతా మార్కెట్‌ను శనివారం నుంచి మంగళవారం వరకు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. కరోనా నిబంధనలు పాటించని షాహదర గాంధీ నగర్ మార్కెట్లోని పన్నెండు దుకాణాలను ఈ నెల 4 నుంచి 12 వరకు మూసివేయనున్నారు. అలాగే జన రద్దీ ఎక్కువగా ఉన్న సరోజనీ నగర్, కమలా నగర్ మార్కెట్లలోని షాపులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. కరోనా నిబంధనలు పాటించకపోతే మూసివేతతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

