మీరట్ : ఉత్తరప్రదేశ్ మీరట్‌లోని ఓ ప్రైవేట్ దవాఖాన వైద్యుడు తమ పిల్లవాడి గాయానికి కుట్లను వేయడానికి బదులు ఫెవిక్విక్ వాడారని ఓ కుటుంబం ఆరోపించింది. బాలుడి తండ్రి సర్దార్ జస్పిందర్ సింగ్ కథనం ప్రకారం పిల్లవాడు ఇంట్లో ఆడుకుంటూ ఓ బల్లను బలంగా ఢీ కొట్టాడు.
దీంతో బాలుడి తలకు తీవ్ర గాయం కావడంతో అతడిని భాగ్యశ్రీ దవాఖానకు తరలించగా.. అక్కడి డాక్టర్ ఫెవిక్విక్ వాడి గాయాన్ని మూసేశాడు. అయినా బాధతో బాలుడు ఏడుస్తూనే ఉన్నాడు. మరుసటి రోజు మరో దవాఖానకు అతడిని తీసుకెళ్లారు.