న్యూఢిల్లీ: ఆయుధాల లైసెన్సు కేసులో ఇవాళ సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జమ్మూకశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ వద్ద అడ్వైజర్‌గా పనిచేసిన బషీర్ ఖాన్ నివాసంలోనూ సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ కేసుకు సంబంధించి సుమారు 40 ప్రదేశాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. నకిలీ గన్ లైసెన్సు స్కామ్‌లో భాగంగా జమ్మూకశ్మీర్, మధ్యప్రదేశ్, న్యూఢిల్లీలోని 14 లొకేషన్లలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నుంచి బషీర్ ఖాన్ వారం క్రితమే రిలీవ్ అయ్యారు. శ్రీనగర్‌లో ని బుల్బుల్ భాగ్ వద్ద ఉన్న బషీర్ ఇంట్లో సోదాలు జరిగాయి.