జైపూర్: నకిలీ ఎరువులు, నాణ్యత లేని విత్తనాలను తయారు చేస్తున్న 30 పరిశ్రమలపై రాజస్థాన్ ప్రభుత్వం దాడులు చేసింది. జైపూర్, కిషన్‌గఢ్, శ్రీ గంగా నగర్ తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో ఇటీవల ఈ సోదాలు కొనసాగాయి. పాలరాయి వ్యర్థాలు, రాతి తునకలు(స్టోన్ డస్ట్), రంగులను వాడి తయారు చేసిన నకిలీ ఎరువులను మార్కెట్లోని కొన్ని రకాల బ్రాండ్ల పేరుతో అమ్ముతున్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. ఇఫ్కో లేబుల్ కలిగిన ఈ నకిలీ ఎరువులను నిత్యం రెండు లక్షలకు పైగా సంచుల చొప్పున రాజస్థాన్‌తో పాటు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ర్టాల్లోని వేలాది మంది రైతులకు విక్రయిస్తున్నట్టు తేలింది. ఈ నకిలీ ఎరువుల దందాకు కొందరు పర్యవేక్షక అధికారులు సహకరించారని, వారి నిర్లక్ష్యం వల్లే ఈ నకిలీ ఎరువుల అమ్మకాలు యథేచ్ఛగా సాగాయని దర్యాప్తు అధికారులు తెలిపారు.