ముంబై, మే 24 (నమస్తే తెలంగాణ): అమెరికన్ పౌరులను మోసం చేస్తున్న నకిలీ కాల్‌సెంటర్ పుణె పోలీసులు దాడి చేసి పలువురిని అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొంతమంది పుణెలోని ప్రైడ్ఐకాన్ భవనంలో బీపీఎస్ కన్సల్టెన్సీ సంస్థ పేరిట కాల్‌సెంటర్ నిర్వహిస్తున్నారు.
వీరు అమెరికన్ పౌరులను డిజిటల్ అరెస్ట్ చేసినట్టు చెప్పి, వారి నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈక్రమంలో నకిలీ కాల్‌సెంటర్‌పై దాడిచేసి.. 100మందికిపైగా అరెస్టు చేసినట్టు పుణె పోలీసులు తెలిపారు. వీరిలో యువతులు కూడా ఉన్నట్టు వెల్లడించారు. నిందితుల నుంచి 41ఫోన్లు, 60 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.