ముంబై, ఏప్రిల్ 25: నాసిక్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) బీపీవో వేధింపుల కేసులో వ్యవస్థీకృత లవ్ జిహాద్ లేదా మత మార్పిడి కుట్ర ఆరోపణలను బలపరిచేందుకు దర్యాప్తు అధికారులకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పౌర హక్కుల పరిరక్షణ సంఘం(ఏఈపీసీఆర్) నిజ నిర్ధారణ నివేదిక పేర్కొంది.
ముంబై ప్రెస్ క్లబ్లో ఆ సంఘం నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసేందుకు ఏప్రిల్ 4న నాసిక్‌ను ఐదుగురు సభ్యుల ఏపీసీఆర్ బృందం సందర్శించింది. ఈ కేసులో నమోదైన 9 ఎఫ్ఐఆర్లలో విభిన్నమైన, పొంతన లేని ఆరోపణలు ఉన్నాయని పోలీసు అధికారులు వారికి తెలిపారు. ది ఫ్రీ ప్రెస్ జర్నల్‌లో వచ్చిన వివరాలను ఉటంకిస్తూ మత మార్పిడికి జరిగిన వృవస్థీకృత ప్రయత్నమేదీ దర్యాప్తు సంస్థలు నిర్ధారించలేదని తెలిపింది.