ముంబై: ఐదవ జనరేషన్‌కు చెందిన అత్యాధునిక ఫైటర్ జెట్ ఎఫ్-35బి, బ్రిటన్ యుద్ధ నౌకపై నిలువుగా ల్యాండ్ అయ్యింది. అరేబియా సముద్రంలో బ్రిటన్, భారత్ మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై సముద్ర తీరానికి చేరిన బ్రిటిష్ రాయల్ నేవీ విమాన వాహక నౌక హెచ్ఎంఎస్ క్వీన్ ఎలిజబెత్‌పై ఎఫ్-35బి యుద్ధ విమానం గురువారం నిలువుగా ల్యాండ్ అయ్యింది. లాక్‌హీడ్ మార్టిన్ తయారు చేసిన ఐదవ తరం ఎయిర్‌క్రాఫ్ట్ ఎఫ్-35బి, ఏకకాలంలో గాలి నుంచి ఉపరితలం, గాలి నుంచి గాల్లోకి క్షిపణులను ప్రయోగించడంతోపాటు ఎలక్ట్రానిక్, ఇంటెలిజెన్స్ వార్ఫేర్ నిర్వహిస్తుంది.
కాగా, విమాన వాహక నౌక హెచ్ఎంఎస్ క్వీన్ ఎలిజబెత్ నేతృత్వంలో బ్రిటన్ స్ట్రైక్ గ్రూప్ భారత్‌తో విన్యాసాల్లో పాల్గొన్నది. ఇటీవల బంగాళాఖాతంలో విన్యాసాలు నిర్వహించగా ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఇవి కొనసాగుతున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో చైనాకు చెక్ చెప్పేందుకు ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘నమస్తే ఇండియా’ అంటూ భారత్‌లోని బ్రిటన్ రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.
#WATCH | F-35B fifth generation fighter aircraft lands vertically on the British Royal Navy aircraft carrier HMS Queen Elizabeth in Arabian Sea near Mumbai. Warship is in India for a joint exercise with Indian forces. pic.twitter.com/2PwkA9PTtL
— ANI (@ANI) October 21, 2021
Namaste 🙏 India 🇮🇳!
— UK in India🇬🇧🇮🇳 (@UKinIndia) October 21, 2021
The UK's 🇬🇧 Carrier Strike Group, led by @HMSQNLZ 🚢 is here! #CSG21 pic.twitter.com/rcckass4Dj