న్యూఢిల్లీ: బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాదికి పొడిగించే అవకాశం ఉన్నదని బ్లూమ్బర్గ్ నివేదిక పేర్కొన్నది. దేశీయంగా ధరలు అధికంగా ఉన్నన్ని రోజులు.. ఈ నియంత్రణలు కూడా కొనసాగే అవకాశం ఉన్నదని ఆర్థికవేత్త సోనాల్ వర్మ అభిప్రాయపడ్డారు. లోక్సభ ఎన్నికల తర్వాత ధరలు దిగిరాకుంటే.. ఈ నియంత్రణ చర్యలను మరింత పొడిగించే అవకాశం ఉన్నదన్నారు. ప్రపంచంలో బియ్యం ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న భారత్.. దేశంలో బియ్యం ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఎగుమతులపై నిషేధం విధించాల్సి వచ్చింది.