Qatar Explosion: ఖతార్ సహజవాయువు కేంద్రం వద్ద పేలుడు.. 54 మందికి గాయాలు, 18 మంది మిస్సింగ్
Qatar Explosion: ఖతార్‌లోని కీలకమైన సహజవాయువు కేంద్రం వద్ద ఆదివారం రాత్రి భారీ పేలుడు ఘటన జరిగింది. ఆ క్షేత్రంపై ఇటీవల ఇరాన్ బాంబు దాడి చేసింది. అయితే ఆ కేంద్రంలో మళ్లీ ఆపరేషన్స్ ప్రారంభించేందుకు వర్కర్లు ప్రయత్నించారు. ఆ సమయంలో పేలుడు జరిగింది. ఆ ప్రమాదంలో 54 మంది గాయపడ్డారు. మరో 18 మంది మిస్సింగ్‌లో ఉన్నట్లు తెలిసింది.
దోహా: ఖతార్‌లోని కీలకమైన సహజవాయువు కేంద్రం వద్ద ఆదివారం రాత్రి భారీ పేలుడు(Qatar Explosion) ఘటన జరిగింది. ఆ క్షేత్రంపై ఇటీవల ఇరాన్ బాంబు దాడి చేసింది. అయితే ఆ కేంద్రంలో మళ్లీ ఆపరేషన్స్ ప్రారంభించేందుకు వర్కర్లు ప్రయత్నించారు. ఆ సమయంలో పేలుడు జరిగింది. ఆ ప్రమాదంలో 54 మంది గాయపడ్డారు. మరో 18 మంది మిస్సింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. రాస్ లాఫన్ పారిశ్రామిక వాడలో పేలుడు ఘటన సంభవించింది. ఆ ఘటన వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లో మరింత ఆందోళనకర వాతావరణం నెలకొన్నది. సహజవాయువుల ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా ఖతార్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నది.
హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో.. అయితే ఇటీవల ఖతార్ తన ఉత్పత్తిని తగ్గించుకున్నది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు ప్రారంభమైన నేపథ్యంలో.. ఎగుమతి టర్మినల్‌ను పునర్ ప్రారంభించాలని ఖతార్ భావించారు. అయితే ఆదివారం పని జరుగుతున్న సమయంలో భారీ పేలుడు ఘటన జరిగింది. ఆ దేశ ప్రభుత్వానికి చెందిన బార్జన్ గ్యాస్ సప్లై కేంద్రంలో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఏ మేరకు నష్టం జరిగిందో ఇంకా అధికారులు అంచనా వేయలేదు.
బార్జన్ ప్లాంట్‌లో ప్రతి రోజు సుమారు 1.4 బిలియన్ క్యూబిక్ ఫీట్ల గ్యాస్‌ను అమ్మే సామర్థ్యం ఉన్నది. రాస్ లాఫన్ పారిశ్రామిక వాడపై గత మార్చిలో ఓ ఇరాన్ మిస్సైల్ ఢీకొన్నది.దీంతో ఖతార్ అక్కడ ఉత్పత్తి ఆపేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

