Exploitation Of Inmate | అత్యాచారం కేసు విచారణ ఖైదీకి లైంగిక వేధింపులు.. జైలు గార్డుపై కేసు
Exploitation Of Inmate | బాలికపై అత్యాచారం కేసులో విచారణ నిమిత్తం రిమాండ్‌లో ఉన్న యువకుడైన ఖైదీ లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాడు. జైలు పరిశీలనకు వచ్చిన న్యాయమూర్తికి దీని గురించి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో జైలు గార్డుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
భోపాల్: బాలికపై అత్యాచారం కేసులో విచారణ నిమిత్తం రిమాండ్‌లో ఉన్న యువకుడైన ఖైదీ లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాడు. (Exploitation Of Inmate) జైలు పరిశీలనకు వచ్చిన న్యాయమూర్తికి దీని గురించి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో జైలు గార్డుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 2022 ఏప్రిల్‌లో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో నిందితుడైన ఆ యువకుడు గత రెండేళ్లుగా రిమాండ్ ఖైదీగా జిల్లా జైలులో ఉన్నాడు.
కాగా, అగర్ మాల్వా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ శివాని శర్మ ఆ జైలును శనివారం సందర్శించారు. ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జైలు గార్డు రూప్ సింగ్ జాదవ్‌పై ఆ యువ ఖైదీ ఫిర్యాదు చేశాడు. తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించాడు. దీంతో మేజిస్ట్రేట్ ఆదేశాలపై స్థానిక పోలీసులు స్పందించారు. జైలు గార్డు రూప్ సింగ్ జాదవ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Case
- exploitation
- Inmate
- Jail Guard
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

