Adani Group | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): సైన్యంలో నియామకాల కోసం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకంపై వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కన్ను పడింది. అదానీ గ్రూప్‌నకు చెందిన ఏసీసీ సిమెంట్ హిమాచల్ ప్రదేశ్ క్యాంపస్‌లో అగ్ని వీరులకు శిక్షణా కేంద్రం ప్రారంభమైంది. అయితే కార్పొరేట్ కంపెనీ అగ్ని వీరులకు శిక్షణనివ్వడంపై నిపుణులు, నెటిజన్లు మండిపడుతున్నారు.
దేశ భద్రతను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతారా? అంటూ కేంద్రాన్ని నిలదీస్తున్నారు. అగ్నిపథ్ స్కీమ్‌కు అదానీకి సంబంధమేంటని నిలదీస్తున్నారు. కాగా, సైన్యంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాల కోసం 2022లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీమ్‌పై తొలినుంచి విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.