Buddhadeb Bhattacharjee | కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య(79) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం బుద్ధదేవ్‌కు నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్‌పై చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. బుద్ధదేవ్ ఆరోగ్యం మెరుగుపడేందుకు కావాల్సిన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. తీవ్ర శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతూ ఆయన జులై 29వ తేదీన కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ హాస్పిటల్లో చేరిన సంగతి తెలిసిందే.